![]() |
![]() |
.webp)
త్వరలో సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి మూడు రోజుల సెలెబ్రేషన్స్ మాములుగా ఉండవు. ఇక బుల్లితెర మీద ఈ వేడుకలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవని చెప్పాలి. ఇక ఈ సంక్రాంతి వేడుకల్ని ఈటీవీ చాల ప్రత్యేకంగా డిజైన్ చేసింది. "ప్రతీ సంక్రాంతికి ఇంటికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతికి మాత్రం మొగుడొచ్చాడు" అంటూ సుధీర్ హోస్ట్ గా వచ్చి ప్రోమో లింక్ చెప్పాడు. "అల్లుడా మజాకా" పేరుతో రాబోతున్న ఈ షోకి మహామహులంతా వచ్చారు.
ఈ మధ్య కాలంలో ఏ మూవీ రిలీజ్ కావాలి అన్నా కూడా ముందు బుల్లితెర మీద ప్రొమోషన్స్ చేసుకోకుండా పట్టాలెక్కడమే లేదు. ఇప్పుడు "సైంధవ్" మూవీ ప్రొమోషన్స్ కోసం విక్టరీ వెంకటేష్ ఈ స్టేజి మీదకు అడుగుపెట్టారు. అలాగే అలనాటి అందాల నటులు వెంకటేష్ తో కలిసి నటించిన మీనా, ఖుష్బూ కూడా వచ్చి వెంకటేష్ తో స్టెప్పులేశారు. ఇక వెంకటేష్ సిగ్నేచర్ డైలాగ్ "అయ్యో అయ్యో అయ్యయ్యో" అనే డైలాగ్ చెప్పి బుల్లితెర కమెడియన్స్ తో డాన్స్ లు వేశారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ అంతా కూడా "ఓకే ఫ్రేమ్ లో వెంకటేష్ గారిని మీనా గారిని కుష్బూ గారిని చూడడం సంథింగ్ స్పెషల్ బాస్ చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి ...సైంధవ్ సినిమా ప్రమోషన్ కోసం వెంకటేష్ గారు రావడం హ్యాపీ బాస్...
వెంకీ మామ వచ్చాడంటే పండుగే పండుగ ...బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్...సుదీర్ అన్న మీరు రావడం చాలా చాలా యాఫీగా ఉన్నాము జై సుదీర్ అన్న ..." అంటూ వెంకీని, సుధీర్ ని వాళ్ళ అభిమానంతో ముంచెత్తారు. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ త్వరలో విడుదలవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఒకటి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే చిరంజీవికి ఒక ల్యాండ్ మార్క్ మూవీ ఉంది ఆయన 150 వ చిత్రాన్ని "ఖైదీ నంబర్ 150 " గా వచ్చి హిట్ కొట్టింది. మరి ఇప్పుడు వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ రిలీజ్ కాబోతోంది.
![]() |
![]() |